Stock Market: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు

Indian bench mark indics starts with profits this morning

  • నిన్న కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్
  • ఒక్కరోజే రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి
  • నేడు ఆశాజనక రీతిలో కొనసాగుతున్న ట్రేడింగ్ 

అమెరికా ఆర్థిక మాంద్యం భయాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నిన్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 2,222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల మేర నష్టపోయాయి. మదుపరుల సంపద రూ.16 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. అయితే, ఇవాళ ఊరట కలిగిస్తూ, నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి. 

ఈ ఉదయం ఆశాజనక వాతావరణంలో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా... నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా లాభంతో ముందంజ వేసింది. 

రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు-సహజవాయువు, ఐటీ, ఆటోమొబైల్, మీడియా, మెటల్ పరిశ్రమల షేర్లు 3 శాతం మేర వృద్ధి కనబర్చాయి. టెక్ మహీంద్రా షేర్లు భారీ లాభాల బాట పట్టగా, ఎస్ బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ నేలచూపులు చూస్తోంది.

  • Loading...

More Telugu News