Madhuri Dixit: సీరియల్ కిల్లర్ గా మాధురీ దీక్షిత్!

Madhuri Dixit plays Serial Killer role in a web series

  • నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో మిస్టర్ దేశ్ పాండే
  • సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వెబ్ సిరీస్ 
  • త్వరలో చిత్రీకరణ ప్రారంభం 

బాలీవుడ్ సీనియర్ తార మాధురీ దీక్షిత్ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో సీరియల్ కిల్లర్ గా నటించనుంది. ఈ వెబ్ సిరీస్ పేరు మిస్టర్ దేశ్ పాండే. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. 

మిస్టర్ దేశ్ పాండే కథాంశం విషయానికొస్తే... ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులో మరో సీరియల్ కిల్లర్ సహకారం తీసుకుంటారు. ఓ ఫ్రెంచ్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఒకట్రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. ఇందులో మాధురీ దీక్షిత్ సీరియల్ కిల్లర్ రోల్ లో ఎలా నటిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

మాధురి ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ నటిస్తున్న భూల్ భులాయియా-3లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News