Chandrababu: గత ప్రభుత్వం కేంద్రం నిధులను మళ్లించింది: సీఎం చంద్రబాబు

Chandrababu made allegations on previous YCP govt
  • కలెక్టర్లతో సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు
  • గృహ నిర్మాణ నిధులను రూ.3,183 కోట్ల మేర మళ్లించారని ఆరోపణ
  • మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదని వెల్లడి
  • కేంద్రం నుంచి రూ.8 వేల కోట్లు రాకుండా పోయాయని ఆవేదన
కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత  ప్రభుత్వం కేంద్రం నిధులను దారిమళ్లించిందని అన్నారు. గృహ నిర్మాణ నిధులను రూ.3,183 కోట్ల మేర మళ్లించిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ నిధులు రూ.500 కోట్లు మళ్లించారని వెల్లడించారు. గృహ నిర్మాణం కోసం గత ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు రూ.1,603 కోట్లను ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం రూ.28 కోట్లు జరిమానా కూడా విధించిందని తెలిపారు. 

ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.8 వేల కోట్ల నిధులు రాకుండా పోయాయని సీఎం చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. నిధుల మళ్లింపు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఏపీ నష్టపోయిందని అన్నారు.
Chandrababu
Collectors
Meeting
TDP-JanaSena-BJP Alliance

More Telugu News