Dogs: ఈ శునకాలు ప్రపంచంలోనే ఫేమస్.. రేటూ ఎక్కువే!
- ముద్దుగా ఉండే అరుదైన జాతుల శునకాలు
- యాక్టివ్ గా, విధేయతతో ఉండటం అదనపు ప్రయోజనం
- కచ్చితమైన రేటు అంటూ లేకుండా లక్షల్లోనే రేటు
చాలా మంది ఇళ్లలో పెంపుడు శునకాలను పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది కూడా. ఇందులో చాలా మంది కంటికి నదురుగా కనబడినదో, ఎవరి వద్ద అయినా చూసినదో... ఇలా పలు రకాల జాతుల శునకాలను పెంచుకుంటున్నారు. మరి ప్రపంచంలో అరుదైన, అత్యంత ఖరీదైన శునక జాతులు ఏవో తెలుసా?
సమోయెడ్ డాగ్స్
రష్యాలోని సైబీరియా ప్రాంతానికి చెందిన అరుదైన జాతి శునకాలివి. ప్రశాంతంగా, ప్రేమగా ఉంటాయి. ఎప్పుడూ నవ్వుతున్నట్టుగా ఉండే ముఖ కవళికలతో ఆకట్టుకుంటాయి. యాక్టివ్ గా ఉంటాయి.
లోచెన్ డాగ్స్..
మొదట్లో ఫ్రాన్స్ ఈ జాతి శునకాలకు ఫేమస్. ఆ తర్వాత ఇవి యూరప్ అంతటా విస్తరించాయి. యాక్టివ్ గా, ఆటలాడుతూ ఉంటాయి.
చో.. చో.. డాగ్స్
ఉత్తర చైనాలో ఉండే పురాతన బ్రీడ్ ఇది. చూడటానికి భలే అందంగా ఉంటాయి. కాస్త మొండిగా వ్యవహరిస్తుంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ.
టిబెటన్ మాస్టిఫ్
రక్షణ కోసం, కాపలా కోసం వాడే అరుదైన జాతి శునకాలివి. యజమానుల పట్ల పూర్తి విధేయతతో ఉంటాయి. వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తాయి. వీటి మెయింటెనెన్స్ చాలా ఖరీదైన వ్యవహారం.
అజవఖ్ డాగ్స్
పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈ శునకాలు వేటకు ఫేమస్. అత్యంత వేగంతో పరుగెత్తుతాయి. యజమానుల పట్ల విధేయంగా ఉంటాయి. రక్షణ, కాపలా కోసం ఈ శునకాలను పెంచుకుంటూ ఉంటారు.
రాట్ వేలర్ డాగ్స్
మంచి ప్రవర్తనతో, మంచి క్రమశిక్షణతో ఉండే శునకాలివి. వీటి ఆహారం, ఆరోగ్యం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. కానీ మంచి తోడుగా ఉంటాయి.