Virat Kohli: శ్రీలంకతో మ్యాచ్: ఇంతకీ ఆ బంతికి కోహ్లీ అవుటా? కాదా?.. వీడియో ఇదిగో!

Virat Kohli Out Or Not Out Major DRS Controversy Watch Video

  • ధనంజయ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ
  • అవుటిచ్చిన ఫీల్డ్ అంపైర్
  • థర్డ్ అంపైర్ మాత్రం కోహ్లీకి అనుకూలంగా నిర్ణయం
  • హెల్మెట్ విసిరికొట్టిన శ్రీలంక వికెట్ కీపర్
  • ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి

శ్రీలంక జట్టుతో కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో నిన్న జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్ అకిల ధనంజయ 15వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ కూడా వేలెత్తాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభమన్ గిల్‌తో మాట్లాడిన కోహ్లీ మైదానం వీడాడు. అయితే, థర్డ్ అంపైర్ రివ్యూ అందరినీ డైలమాలో పడేసింది. 

బంతి కోహ్లీ బ్యాట్‌ను దాటి ప్యాడ్‌ను తాకడానికి ముందు అల్ట్రాఎడ్జ్ కనిపించింది. బ్యాట్‌కు, బంతికి మధ్య చాలానే గ్యాప్ ఉన్నట్టు చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ కోహ్లీకి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడు. ఈ నిర్ణయం శ్రీలంక ఫీల్డర్లతోపాటు జట్టు హెడ్‌కోచ్ సనత్ జయసూర్యను అసహనానికి గురిచేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అయితే తన హెల్మెట్‌ను తీసి నేలకేసి కొట్టాడు. 

ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేసిన కోహ్లీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. మరో నాలుగు ఓవర్లు మాత్రమే ఆడి వాండెర్సే బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 19 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ రెండు ఫోర్లతో 14 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండెర్సే 33 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

  • Loading...

More Telugu News