Raj Tarun: రాజ్‌తరుణ్- లావణ్య కేసులో మరో మలుపు.. పరస్పరం ఫిర్యాదు చేసుకున్న రాజ్‌తరుణ్ స్నేహితుడు శేఖర్, లావణ్య

Twist In Tollywood Actor Raj Tarun And Lavanya Case

  • శేఖర్‌బాషా తనపై దాడి చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు
  • లావణ్యే తనపై దాడికి యత్నించిందని శేఖర్ ఫిర్యాదు
  • ఓ చానల్ చర్చా కార్యక్రమం సందర్భంగా గొడవ

టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్-నటి లావణ్య కేసులో ఇది మరో మలుపు. రాజ్‌తరుణ్ స్నేహితుడు ఆర్‌జే శేఖర్‌బాషా, లావణ్య పరస్పరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శేఖర్ తనపై దాడి చేశాడని లావణ్య.. లావణ్యే తనపై దాడికి యత్నించిందని శేఖర్ తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. శేఖర్‌బాషా ఓ యూట్యూబ్ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. చర్చ సందర్భంగా ఆయన పదేపదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

 అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేస్తూ బాషా తనపై దాడికి పాల్పడడమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది. బాషా కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, రాజ్‌తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Raj Tarun
Lavanya
Tollywood
Sekhar Basha
  • Loading...

More Telugu News