Nara Lokesh: జగన్‌వి ఫేక్ పనులు.. ‘సాక్షి’వి ఫేక్ రాతలు: లోకేశ్

Lokesh warning to the Sakshi

టీడీపీ కార్యకర్త ఎస్సై చొక్కా పట్టుకున్నట్టుగా సాక్షి దినపత్రికలో ఫొటో
తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్, చంద్రబాబుః
తప్పుడు రాతలకు చర్యలు తప్పవని హెచ్చరిక


బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఓ టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారంటూ ఆదివారం సాక్షిలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సాక్షిలో తప్పుడు కథనం రాశారంటూ మండిపడ్డారు. మార్ఫింగ్ ఫొటోతో విష ప్రచారం చేస్తున్నారనీ, పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదనీ అన్నారు. యజమాని జగన్ ఫేక్ పనులు చేస్తుంటే .. ఆయన క్విడ్ ప్రోకో విష పుత్రిక సాక్షి ఫేక్ రాతలు రాస్తోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన దుయ్యబట్టారు.

శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవు అంటూ లోకేశ్ హెచ్చరించారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన రియల్ వీడియోను లోకేశ్ షేర్ చేశారు. మరో పక్క టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఈ అంశంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ఫేక్ గాళ్లను నమ్మొద్దు.. ఫేక్ రాజకీయాల ట్రాప్‌లో పడి మోసపోవద్దు అని సూచించారు.

Nara Lokesh
Minister
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News