Bangladesh: మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్... తాజా ఘర్షణల్లో 72 మంది మృతి

Once again violence sparks in Bangladesh led 72 died

  • బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక జ్వాలలు
  • సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పై దాడి... 12 మంది పోలీసుల మృతి
  • దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు భగ్గుమన్నాయి. తాజా హింసలో 72 మంది మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరణించినవారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. వీరిలో 13 మంది పోలీసులు సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో మరణించారు. 

1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరగ్గా... ఆ పోరులో అమరులైన వారి కుటుంబ సభ్యులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే, ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాలని బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లెక్కారు. 

ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవలి వరకు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది వరకు మృతి చెందారు. తాజాగా, మరోసారి ఘర్షణలు చెలరేగడంతో బంగ్లాదేశ్ లో నిరవధిక కర్ఫ్యూ విధించారు.

Bangladesh
Violence
Reservations
Police
Protesters
  • Loading...

More Telugu News