Road Accident: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు ఏపీ యువకుల మృతి
![Two AP Youth died in road accident in Gachibowli](https://imgd.ap7am.com/thumbnail/cr-20240804tn66af775905e4f.jpg)
- కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద దుర్ఘటన
- వేగంగా వచ్చి రెయిలింగ్ ను ఢీకొట్టిన బైకు
- ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిపోయిన వైనం
- మృతులు గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్, బాలప్రసన్నగా గుర్తింపు
హైదరాబాదులోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బైకు ఫ్లైఓవర్ రెయిలింగ్ ను ఢీకొని పైనుంచి కిందపడిపోయింది. దాంతో ఆ యువకులు మృత్యువాత పడ్డారు.
మృతులను గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్, బాలప్రసన్నగా గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రోహిత్, బాలప్రసన్న మరణవార్తతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.