Allu Arjun: వాయనాడ్ బాధితులకు విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

Allu Arjun doiantes Rs 25 lakkhs to Kerala CM Relief Fund
 
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది మృతి చెందడం పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చలించిపోయారు. వాయనాడ్ లో ప్రకృతి విలయం పట్ల తాను తీవ్ర విచారానికి గురైనట్టు వెల్లడించారు. కేరళ ప్రజలు తనను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటారని, అలాంటి ప్రాంతంలో ఈ విపత్తు సంభవించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో వాయనాడ్ సహాయక చర్యల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు. కేరళ ప్రజల భద్రత కోసం, ఈ కష్టకాలంలో వారు ధైర్యం పుంజుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Allu Arjun
Wayanad
Donation
Kerala CM Relief Fund

More Telugu News