Shashi Tharoor: వయనాడ్ విషాదం... వివాదాస్పదమైన శశిథరూర్ ట్వీట్

Shashi Tharoor On Memorable Row After Wayanad Visit

  • వయనాడ్‌లో పర్యటించి బాధితులకు సామాగ్రి అందించిన కాంగ్రెస్ ఎంపీ
  • ఇది తనకు 'మరుపురానిది' అంటూ ట్వీట్
  • నెటిజన్ల విమర్శలతో వివరణ ఇచ్చిన శశిథరూర్

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి వందలాదిమంది మృతి చెందగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. కొండచరియలు విరిగిన, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన శశిథరూర్ ఆ తర్వాత 'ఈ తన పర్యటన మరుపురానిది' అని పేర్కొనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

శశిథరూర్ శనివారం వయనాడ్‌లో పర్యటించారు. అక్కడ తనవంతుగా కొంత సామాగ్రిని బాధితులకు అందించారు. ఈ సందర్భంగా తన పర్యటనను మరుపురానిదిగా ఆయన పేర్కొన్నారు. నెటిజన్ల విమర్శలతో ఆయన వివరణ ఇచ్చారు. మెమోరబుల్ అంటూ తాను ఉపయోగించిన పదానికి ఉన్న అర్థాన్ని వివరించారు.

మెమోరబుల్ అంటే గుర్తుంచుకోదగిన... గుర్తుండిపోయే సంఘటనను మెమోరబుల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయా ఘటనలకు ఉన్న ప్రత్యేకత లేదా అవి మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చినప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తారన్నారు. పరోక్షంగా వయనాడ్ వరదలు బాధాకరమైన జ్ఞాపకాలను మిగిల్చినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News