Revanth Reddy: న్యూయార్క్‌లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం... ఇదిగో వీడియో

CM Revanth Reddy in America

  • అమెరికాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి బృందం
  • జై రేవంతన్న అంటూ న్యూయార్క్ విమానాశ్రయంలో నినాదాలు
  • పది రోజుల పాటు అమెరికాలో రేవంత్ రెడ్డి బృందం

అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయం చేరుకున్న సీఎం బృందానికి ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు 'జై రేవంతన్న... జైజై రేవంతన్న... రేవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అభిమానులు, కాంగ్రెస్ ఎన్నారైలు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, ఆయన బృందం విదేశాలలో పర్యటిస్తోంది. ఈ నెల 14న తిరిగి తెలంగాణకు రానున్నారు.

Revanth Reddy
USA
Congress
Telangana

More Telugu News