Yamini Krishna Murthy: ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

Renowned classical dancer Yamini Krsihna Murthy passes away

 


ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతుల్లో యామినీ కృష్ణమూర్తి విశేష పేరుప్రఖ్యాతులు  పొందారు. 

ఆమె 1940లో మదనపల్లెలో జన్మించారు. ప్రఖ్యాత నృత్యకారిణి, గురువు రుక్మిణీ దేవి అరుండేల్ వద్ద శిష్యరికం చేశారు. 1957లో చెన్నైలో తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చారు. 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 

యామినీ కృష్ణమూర్తి టీటీడీ ఆస్థాన నాట్యకళాకారిణిగానూ సేవలు అందించారు. ఆమె ఒడిస్సీ నృత్యరీతిలోనూ ప్రావీణ్యం సంపాదించడం విశేషం.

More Telugu News