Nuthan Naidu: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 'బిగ్ బాస్' ఫేమ్ నూతన్ నాయుడు

Nuthan Naidu joins Congress party

  • బిగ్ బాస్ సీజన్-2 ద్వారా పాప్యులరైన నూతన్ నాయుడు
  • కొంతకాలంగా తెరమరుగు
  • తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిక

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-2 ద్వారా పాప్యులర్ అయిన వారిలో నూతన్ నాయుడు ఒకరు. నూతన్ నాయుడు బిగ్ బాస్ తర్వాత సినీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

తాజాగా, నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... నూతన్ నాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తానని నూతన్ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. 

బిగ్ బాస్ తర్వాత కొన్ని సినిమాలు చేసిన నూతన్ నాయుడు కొంతకాలంగా తెరమరుగయ్యారు. గతంలో ఆయనపై ఓ వివాదం కూడా ఉంది. తమ ఇంట్లో పనిచేసే దళిత వ్యక్తికి శిరోముండనం చేశారన్న కేసును ఎదుర్కొన్నారు. గతంలో నూతన్ నాయుడు మాజీ ఎంపీ లగడపాటి తరఫున సర్వేలు కూడా నిర్వహించారని ప్రచారంలో ఉంది. ఇన్నాళ్లకు నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా మళ్లీ తెరపైకి వచ్చారు.

Nuthan Naidu
Congress
YS Sharmila
Andhra Pradesh
  • Loading...

More Telugu News