Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో క్వార్టర్స్ కు దీపికా కుమారి
![Deepika Kumari defeated Michelle Kroppen in the round of 16 to book her place in the quarter finals](https://imgd.ap7am.com/thumbnail/cr-20240803tn66adfef143116.jpg)
- రౌండ్ 16లో గ్రాండ్ విక్టరీ
- జర్మనీ ప్లేయర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో దీపిక విజయం
- క్వార్టర్స్ లో ఆమె సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒకరితో పోటీ
పారిస్ ఒలింపిక్స్ లో శనివారం భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. 25మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌లో మను భాకర్ త్రుటిలో పతకం చేజార్చుకుంది. నాల్గో స్థానంతో సరిపెట్టుకోవడంతో పతకం మిస్ అయ్యింది. అయితే, అర్చరీలో దీపికా కుమారి సత్తా చాటింది. ఆర్చరీ సింగిల్స్ లో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.
రౌండ్ 16లో భాగంగా జర్మనీ ప్లేయర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో దీపిక నెగ్గింది. దీంతో ఇవాళ సాయంత్రం 5.09 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. క్వార్టర్స్ లో ఆమె సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒకరితో పోటీ పడనుందిు. ఇక ఇప్పటివరకు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు చేరాయి.