Puja Khedkar: అరెస్ట్ భయంతో దుబాయ్‌కు పూజాఖేద్కర్ పరారీ?

Former probationary IAS officer Puja Khedkar Runs away Dubai

  • తప్పుడు ధ్రువీకరణ పత్రాల కేసులో పూజాఖేద్కర్‌పై ఆరోపణలు
  • ముందస్తు బెయిలుకు ఢిల్లీ కోర్టు నిరాకరణ
  • గాలిస్తున్న పోలీసులు.. ఫోన్ స్విచ్ఛాఫ్
  • మరో ఆరుగురి వైకల్య పత్రాలపైనా యూపీఎస్సీ అనుమానం

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజాఖేద్కర్ అరెస్ట్ భయంతో దుబాయ్‌కు పరారయ్యారా? అంటే జాతీయ మీడియా అవుననే అంటోంది. అరెస్ట్ భయంతో ఆమె దేశం నుంచి పరారయ్యారని కథనాలు వెలువడుతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కేసులో పూజ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ తప్పదని భావించిన ఆమె దుబాయ్‌కు పారిపోయినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, పూజ వివాదం నేపథ్యంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ (డీపీటీవో) వారి పత్రాలను పరిశీలించనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తమ ఎదుట హాజరు కావాలన్న ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఆమె యూపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News