Vijay Deverakonda: కొత్త మూవీలో డిఫ‌రెంట్ లుక్‌లో విజయ్‌ దేవరకొండ!

Vijay Deverakonda New Movie First Look Poster

  • గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంతో విజయ్‌ దేవరకొండ కొత్త‌ మూవీ
  • 'వీడీ 12' వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మూవీ 
  • ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్ర‌క‌టించిన‌ మేక‌ర్స్ 
  • అనిరుధ్‌ రవిచందర్ బాణీలు

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీలో నటిస్తున్న‌ విష‌యం తెలిసిందే. 'వీడీ 12' వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విజ‌య్ లుక్‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా 'వీడీ 12' ఫస్ట్‌ లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

"అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.." అంటూ షేర్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ డిఫ‌రెంట్‌ హెయిర్‌ స్టైల్‌, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింద‌నే చెప్పాలి. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి తమిళ‌ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ రవిచందర్ బాణీలు అందిస్తున్నాడు.

More Telugu News