Harbhajan Singh: పాక్ జర్నలిస్ట్‌కు హర్భజన్ అదిరిపోయే కౌంటర్

- భజ్జీ బౌలింగ్‌లో అఫ్రిది సిక్స్, ఫోర్ కొట్టిన వీడియోను షేర్ చేసిన పాక్ జర్నలిస్ట్ ఫరీద్‌ఖాన్
- ఇందుకోసమే భారత జట్టు పాక్ రానంటోందని ఎద్దేవా
- అసలు విషయం అది కాదంటూ ఫొటోను షేర్ చేసిన హర్భజన్
తన బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది సిక్స్, ఫోర్ కొట్టిన వీడియోను షేర్ చేసిన చేసిన పాక్ జర్నలిస్ట్ ఫరీద్‌ఖాన్‌కు టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ ‘ఎఫ్’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎఫ్’ అంటే ఏదేదో ఊహించుకోవద్దంటూ భజ్జీ చేసిన ఎక్స్ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యమిచ్చే బీసీసీఐ భారత జట్టును పాక్ పంపేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ ఫరీద్‌ఖాన్.. భారత జట్టు తమ దేశం వచ్చి ఆడాలని, తాము భద్రత కల్పిస్తామని అన్నాడు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో పాక్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది సిక్స్, ఫోర్ కొట్టిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఇందుకేనా మీరు పాకిస్థాన్ రావడానికి ఇష్టపడడం లేదు. దీనికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తున్నారా?’’ అని రాసుకొచ్చాడు.
