Andhra Pradesh: పంట నష్టపోయిన రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Good news for AP farmers

  • రైతులకు 80 శాతం రాయితీపై విత్తన సరఫరా
  • జూన్, జులై నెలల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం
  • 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33 వేల హెక్టార్లలో వరి పంట నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేయనుంది. జూన్, జులై నెలలలో సాధారణానికి మించి 48.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలకు 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33 వేల హెక్టార్లలో వరి పంట మునిగిపోయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా పంటనష్టం సంభవించింది.

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్‌ను నియమించారు. సెర్ప్ సీఈవోగా ఉన్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Rains
  • Loading...

More Telugu News