Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

lay foundation for Skill University

  • మీర్‌ఖాన్‌పేటలో శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో 57 ఎకరాల్లో నిర్మాణం
  • వర్సిటీతో పాటు నాలుగు సెంటర్లకు శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. జిల్లాలోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో 57 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. వర్సిటీతో పాటు నాలుగు సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు శంకుస్థాపన చేశారు.

Revanth Reddy
Congress
Mallu Bhatti Vikramarka
  • Loading...

More Telugu News