Raj Tarun: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సినీ నటుడు రాజ్ తరుణ్

Raj Tharun files anticipatory bail in High Court

  • సినీ నటి లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
  • రాజ్ తరుణ్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం 
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

సినీ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నటి లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ కొట్టి పారేస్తున్నారు.

Raj Tarun
TS High Court
Telangana
Tollywood
  • Loading...

More Telugu News