Nifty: చరిత్రలో తొలిసారిగా... 25 వేలకు ఎగువన ముగిసిన నిఫ్టీ

Nifty first time closed above 25 thousand mark
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా దూసుకెళ్లాయి. మరోమారు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. మార్కెట్లో సానుకూల పవనాలు వీచిన నేపథ్యంలో... చరిత్రలో తొలిసారిగా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 25,010 వద్ద స్థిరపడింది. అటు, సెన్సెక్స్ 126 పాయింట్ల వృద్ధితో 81,867 వద్ద ముగిసింది. 

ఇవాళ ఉదయం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. దాంతో ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 82,129... నిఫ్టీ 25,078 వద్ద కొనసాగాయి.

ఇక, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, నెస్లే, మారుతి సుజుకి, రిలయన్స్, భారతి ఎయిర్ టెల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు ఆర్జించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్ గణనీయంగా నష్టాలు చవిచూశాయి.
Nifty
Sensex
Stock Market
India

More Telugu News