Bhagyasree Borse: సన్నజాజి సౌందర్యం .. భాగ్యశ్రీ బోర్సే!

Bhagyasree Borse Special

  • తెలుగు తెరపై తళుక్కున మెరిసిన కృతి శెట్టి 
  • ఆ తరువాత సందడి చేసిన శ్రీలీల
  • కొత్తగా తెరపైకి వస్తున్న భాగ్యశ్రీ బోర్సే 
  • ఆమె హవా కొనసాగడం ఖాయమంటున్న ఫ్యాన్స్ 


హీరోయిన్ అంటే అందంగా ఉండవలసిందే .. అందంగా ఉన్నవారే హీరోయిన్ అవుతారు. ఎటు చూసినా అందమనేది హీరోయిన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండవలసిందే. అందమే ముందు .. అభినయం తరువాత అంటూ ఆడియన్స్ వారి విషయంలో కొంత మినహాయింపు కూడా ఇస్తుంటారు. అందువల్లనే భాష రాకపోయినా, ఇతర ప్రాంతాలకు చెందిన భామలు రాణిస్తుంటారు.

అందానికి భాషతో పనిలేదు. అందం ప్రధమ లక్షణం .. ప్రధాన లక్షణం ఆకర్షించడమే. అందువల్లనే కొత్త అందాలను ఎప్పటికప్పుడు మేకర్స్ తెరపైకి తీసుకుని వస్తుంటారు. ఒకప్పుడు ఇలా కొత్తగా వచ్చిన హీరోయిన్స్ సంఖ్య ఎక్కువగా కనిపించేది. ఏ హీరోయిన్ ను ఎంచుకోవాలా అనే ఒక ఆలోచనలో మేకర్స్ తర్జనభర్జనలు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

 కృతి శెట్టి - శ్రీలీల తరువాత ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ లో అటు గ్లామర్ పరంగా .. ఇటు నటన పరంగా ఔరా అనిపించిన వాళ్లయితే ఎవరూ లేరు. ఆషిక రంగనాథ్ కొంతవరకూ ఆకట్టుకోగలిగిందంతే. ఈ నేపథ్యంలోనే 'భాగ్యశ్రీ బోర్సే' అనే మరో బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ఈ సుందరి ఎంట్రీ ఇస్తోంది. పోస్టర్లతోనే పోలో మంటూ మనసులు దోచేస్తున్న ఈ భామ, ఈ సినిమా హిట్ అయితే జోరు చూపించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సుందరి దూకుడు ఏ రేంజ్ లో ఉంటుందో.

Bhagyasree Borse
Actress
Mr Bachchan
  • Loading...

More Telugu News