India: లెబనాన్‌ను వీడండి... భారత్ నుంచి ఇక్కడికి ఎవరూ రాకండి: రాయబార కార్యాలయం హెచ్చరిక
- అత్యవసరంగా లెబనాన్‌లో ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచన
- పశ్చిమాసియా తాజా పరిస్థితుల నేపథ్యంలో హెచ్చరికలు
- అవసరమైతే బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచన
లెబనాన్ పర్యటనకు రావొద్దంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం నేడు భారత పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. భారతీయులు ఎవరూ ఈ దేశానికి రావొద్దని సూచించింది. అలాగే లెబనాన్‌లో ఉన్న భారతీయులు కూడా వెళ్లిపోవాలని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తే, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ హెచ్చరికలు జారీ చేసింది.
తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయులు ఎవరూ లెబనాన్‌కు రావొద్దని పేర్కొంది. ఏదైనా అవసరమైతే cons.beirut@mea.gov.in ఈమెయిల్ ఐడీ ద్వారా లేదా ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ +96176860128 ద్వారా బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.