Chandrababu: గుండుమల గ్రామంలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu visits pensioners in Gundumala village

  • శ్రీశైలం పర్యటన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాకు వెళ్లిన సీఎం
  • గుండుమల గ్రామంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడిన వైనం
  • వారి సమస్యల పట్ల సానుకూల స్పందన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

ఓబులమ్మ అనే వితంతు మహిళ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పెన్షన్ అందజేశారు. తన ఇల్లు సరిగా లేదని ఓబులమ్మ చెప్పడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ను పిలిచి, ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

Chandrababu
Gundumala
Pensioners
NTR Bharosa
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News