Raghubabu: పాతికేళ్ల పాటు నాన్న సంపాదించిందంతా తుడిచిపెట్టుకుపోయింది: నటుడు రఘుబాబు

Raghubabu Interview

  • గిరిబాబు కొడుకు హీరోగా చేసిన 'ఇంద్రజిత్'
  • 1990లో విడుదలైన సినిమా
  • అప్పట్లోనే దాని బడ్జెట్ 50లక్షలు  
  • ఆ సినిమా ఆడలేదన్న రఘుబాబు
  • ఎన్నో కష్టాలు పడ్డామని వెల్లడి


గిరిబాబు తనయుడు రఘుబాబు మంచి కమెడియన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. తాజాగా 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " మా సొంత బ్యానర్ పై నాన్న సినిమాలు నిర్మిస్తూ ఉండేవారు. 1990లో తమ్ముడు హీరోగా 'ఇంద్రజిత్' సినిమాను నిర్మించాము. అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖర్చుపెట్టాము. సినిమా బాగానే ఆడింది .. కానీ డబ్బులు మా వరకూ రాలేదు" అని అన్నారు. 

''నిజానికి ఆ సినిమాను రిలీజ్ చేయడం కోసమే నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. రిలీజ్ చేసిన తరువాత చూస్తే మాకు చాలా పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. నిజానికి సినిమా బయటపడిపోయిన తరువాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కానీ నాన్న గారు అలా కాదు,  మాకు రూపాయి రావలసి ఉంది అంటూ ఎవరూ గేటు ముందుకు రాకూడదనేది ఆయన పద్ధతి" అని చెప్పారు. 

'ఇంద్రజిత్' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం, నాన్నగారు స్థిరాస్తులను అమ్మేశారు. ఆయన 20 - 25 సంవత్సరాలుగా సంపాదించిందంతా పోయింది. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుందాం .. లేదంటే ఊరు వెళ్లిపోదామని నాన్న చెప్పాడు. అలా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడటం జరిగింది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News