BRS: రేవంత్, భట్టి వ్యాఖ్యలపై నిరసన.. నల్లరంగు బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు

BRS MLAs Wears Black Badges And Attended To Assembly

  • సబిత, సునీత లక్ష్మారెడ్డిలపై రేవంత్, భట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆరోపణ
  • వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • వారు తమ వ్యాఖ్యలతో మొత్తం మహిళలనే అవమానించారని ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్, భట్టి వెంటనే సబిత, సునీతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సభలో వారి ప్రవర్తన తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై చులకన వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తమ వ్యాఖ్యలతో మొత్తం మహిళలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నలుపురంగు కోటు ధరించి సభకు హాజరు కావడంపై మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించారు. స్పీకర్ కూడా తమకు మద్దతుగానే నలుపురంగు కోటు ధరించి వచ్చారంటూ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.

  • Loading...

More Telugu News