Chandrababu: శ్రీశైలం పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu leaves for Srisailam tour

  • నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • మల్లన్నను దర్శించుకోనున్న సీఎం
  • శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి
  • శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా గుండుమల పయనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్ లో పయనమయ్యారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ఆయన సంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ పర్యటన కోసం చంద్రబాబు వెంట అధికారులు కూడా బయల్దేరారు. 

శ్రీశైలం పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి పట్టనున్నారు. కుడి గట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. 

అనంతరం శ్రీశైలం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా గుండుమల గ్రామం వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు.

More Telugu News