Kajal Agarwal: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న తెలుగు సినిమాలు!

- ఆగస్టు 1వ తేదీన 'ఆహా'లో 'రక్షణ'
- అదే రోజున ఈటీవీలో 'సత్యభామ' .. 'డియర్ నాన్న'
- ఆగస్టు 3వ తేదీన 'ఆహా'లో 'తెప్పసముద్రం'
- అర్జున్ అంబటి ప్రధాన పాత్రగా సాగే కథ
ఈ వారం తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఏ సినిమాలు వస్తున్నాయా అనే విషయంలో ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. వాళ్లలో మరింత కుతూహలాన్ని పెంచే కంటెంట్ ను వదులుతున్నారు. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు 'రక్షణ' సినిమా రానుంది. అంటే రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ కనిపించనుంది.

