Wayanad: వయనాడ్ విషాదం... పార్లమెంట్‌లో అమిత్ షా కీలక ప్రకటన
- కేరళను ముందే హెచ్చరించామన్న అమిత్ షా
- ఈ ముప్పు గురించి జులై 23న అప్రమత్తం చేశామన్న కేంద్రమంత్రి
- 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు వెల్లడి
భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని తాము కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముప్పు గురించి కేంద్రం జులై 23నే అప్రమత్తం చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేదన్నారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.
180కి చేరిన మృతులు
కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 180కి చేరింది. వయనాడ్‌లో సహాయక చర్యల్లో ఆర్మీ పోర్టబుల్ బ్రిడ్జిలను వినియోగిస్తోంది. వీటిని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తొలిసారి ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలను హెలికాప్టర్ల సహాయంతో తరలించేందుకు వీలుంటుంది. ఢిల్లీ నుంచి 110 అడుగుల బ్రిడ్జిని తీసుకువచ్చారు. మరో 170 అడుగుల వంతెనను తయారు చేయాలని ఆర్మీ భావిస్తోంది.