Gopichand: మళ్లీ ట్రాక్ పైకి శ్రీను వైట్ల .. 'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్!

Viswam Movie Making Video Released

  • మళ్లీ రంగంలోకి దిగిన శ్రీను వైట్ల 
  • గోపీచంద్ హీరోగా రూపొందుతున్న 'విశ్వం'
  • విదేశాల్లో జరుగుతున్న చిత్రీకరణ 
  • కథానాయికగా అలరించనున్న కావ్య థాపర్   


ఒకప్పుడు వరుస హిట్లను నమోదు చేస్తూ వచ్చిన శ్రీను వైట్లకి ఆ తరువాత కాలం కలిసి రాలేదు. వరుస పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. 2018లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఫలితం కూడా ఆయనను నిరాశపరిచింది. ఆ తరువాత ఆయన నుంచి ఇంతవరకూ సినిమా రాలేదు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.

శ్రీను వైట్ల - గోపీచంద్ కాంబినేషన్లో 'విశ్వం' సినిమా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారనే విషయం ఈ వీడియోను బట్టి తెలుస్తోంది.

భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయనీ .. విదేశాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుందనే విషయం అర్థమవుతోంది. ఇక మరోసారి ట్రైన్ లో కామెడీ ఎపిసోడ్ ను శ్రీను వైట్ల ప్లాన్ చేశాడని తెలుస్తోంది. కావ్య థాపర్ కథానాయికగా అలరించనుంది. అటు శ్రీను వైట్ల .. ఇటు గోపీచంద్ ఇద్దరికీ ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News