Muttaiah Muralidharan: ప్రపంచమంతా అతడిని ముత్తయ్య మురళీధరన్ అనే అనుకుంది.. వైరల్ అవుతున్న ఈ డ్యాన్స్ వీడియోపై అసలు నిజం ఇదీ!

SRH Bowling Coach Muttaiah Muralidharan Vibing To Tauba Tauba But What Is Truth Is

  • ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మురళీధరన్
  • బాలీవుడ్ హిట్ సాంగ్ ‘తౌబా తౌబా..’కు డ్యాన్స్
  • మురళీ అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రశంసలు
  • అసలు విషయం తెలిశాక ఆశ్చర్యపోతూ పోస్టులు

మణికట్టు మాయాజాలంతో దిగ్గజ బ్యాటర్లను సైతం వణికించిన బౌలర్‌గానే ముత్తయ్య మురళీధరన్ మనకు తెలుసు. ఎన్నో రికార్డులను తన పేరున రాసుకున్న మురళీధరన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడీ క్రికెటర్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనేగా మీ డౌట్. దానికీ ఓ కారణం ఉంది. 

సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అందులో మురళీధరన్ బాలీవుడ్ హిట్ సాంగ్ ‘తౌబా తౌబా..’ పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. ఇంకేముంది.. ఈ స్పిన్ మాంత్రికుడిలో ఈ కళ కూడా ఉందా? అని అభిమానులే కాదు.. క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు. 

ఈ వీడియో ఇంతగా వైరల్ అయిన తర్వాత తెలిసిందేంటంటే.. అతడు మురళీధరన్ కాదని. అచ్చం మురళీధరన్ కటౌట్‌లానే ఉన్న ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ కొరియాగ్రాఫర్ కిరణ్ జోపాల్. ఈ డాన్స్ వీడియోను అతడే స్వయంగా అప్‌లోడ్ చేశాడు. ఇది చూసిన మురళీధరన్ అభిమానులు అతడే అనుకుని వైరల్ చేశారు.

ఆ వీడియోను చూసిన అందరూ మనోడు మురళీధరనే అనుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్‌గా మురళీలానే ఉండడంతో అందరూ అతడు మురళీనే అని భ్రమపడ్డారు. కానీ, అసలు విషయం తెలిశాక అందరూ నోరెళ్లబెట్టారు. ‘అవునా.. అతడు మురళీ కాదా!’ అని కామెంట్లతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూశాక మీరు కూడా అతడు మురళీనే అని అనుకుంటారు. కావాలంటే చూడండి!

More Telugu News