Pruthviraj Sukumaran: 'ది గోట్ లైఫ్' దూసుకుపోతుండటానికి కారణం ఇదే!
- మార్చి 28న విడుదలైన 'ది గోట్ లైఫ్'
- ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్
- యథార్థ సంఘటన ఆధారంగా సాగే కథ
- థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్
- ఓటీటీలో దూసుకుపోతున్న కంటెంట్
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' రూపొందింది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన సినిమా ఇది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. బ్లేస్సి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన చాలామంది, ఇది ఒక డాక్యుమెంటరీలా ఉందనే విమర్శలు చేశారు.
కువైట్ వెళితే అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో చాలామంది యువకులు వెళుతూ ఉంటారు. వాళ్లలో ఎక్కువమంది మోసపోతూ ఉంటారు. ఫలితంగా వారు ఎడారిలో గొర్రెలను .. ఒంటెలను మేపుతూ అలవాటు లేని ఎండలకు తట్టుకోలేక .. తప్పించుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి ఒక కథతోనే ఈ సినిమా రూపొందింది.
ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలోనే, కువైట్ కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడటం మొదలైంది. ఈ సినిమాలోని హీరో మాదిరిగానే అక్కడ ఇబ్బందులు పడుతున్నవారు వీడియోలు పోస్టు చేయడం .. అవి వైరల్ కావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో 'ది గోట్ లైఫ్' సినిమా ప్రస్తావన రావడం, అసలు ఆ సినిమాలో ఏముందా అని చూసేవారు ఎక్కువైపోవడం జరుగుతోంది. ఈ కారణంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతోంది.