Team India: బంతి సుడులు తిరుగుతున్న పిచ్ పై 137/9 స్కోరు చేసిన టీమిండియా

Team India gets troubles on spin friendly pitch

  • టీమిండియా, శ్రీలంక మధ్య చివరి టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పిచ్
  • అతికష్టంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆటగాళ్లు

శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి కష్టమ్మీద బ్యాటింగ్ చేసింది. స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పల్లెకెలె స్టేడియం పిచ్ పై బంతి సుడులు తిరుగుతుండడంతో, బ్యాటింగ్ చేసేందుకు టీమిండియా బ్యాటర్లు చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తమ్మీద టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ చేసిన 39 పరుగులే అత్యధికం. లోయరార్డర్ లో రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేయడంతో టీమిండియాకు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. 

యశస్వి జైస్వాల్ (10), సంజూ శాంసన్ (0), రింకూ సింగ్ (1), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8), శివమ్ దూబే (13) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 3, వనిందు హసరంగ 2, చమిందు విక్రమసింఘే 1, అసితా ఫెర్నాండో 1, రమేశ్ మెండిస్ 1 వికెట్ తీశారు.

More Telugu News