Team India: చివరి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక... 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India lost 3 early wickets against Sri Lanka

  • ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా
  • నేడు టీమిండియా-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

శ్రీలంకతో టీ20 సిరీస్ ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా... నేడు చివరి టీ20 ఆడుతోంది. పల్లెకెలెలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), వికెట్ కీపర్ సంజూ శాంసన్ (0), రింకూ సింగ్ (1) నిరాశపరిచారు. రెండో టీ20లో డకౌట్ అయిన సంజూ శాంసన్... నేటి మ్యాచ్ లోనూ సున్నాకే వెనుదిరిగాడు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, చమిందు విక్రమసింఘే 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లలో 3 వికెట్లకు 28 పరుగులు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 9, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News