Chandrababu: ఇది హిస్టరీ షాట్... మను బాకర్ కు మరో పతకంపై సీఎం చంద్రబాబు స్పందన

CM Chandrababu lauds Manu Baker after she claimed second bronze in Paris Olympics

  • పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు కాంస్యం
  • ఫైనల్స్ లో రాణించిన మను బాకర్, సరబ్ జోత్ సింగ్ జోడీ
  • ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను
  • 124 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ గా రికార్డ్ 

హర్యానా అమ్మాయి మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మరో కాంస్యం చేజిక్కించుకోవడం తెలిసిందే. ఇటీవలే 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్యం సాధించిన మను బాకర్... నేడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్ జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా 124 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 

మను బాకర్ సాధించిన ఘనతపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆమె సంధించిన షాట్ చారిత్రాత్మకం అని అభినందించారు. 124 ఏళ్ల తర్వాత ఓ భారత క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించడం అపురూపం అని కొనియాడారు. ఈ సందర్భంగా మను బాకర్ కు, సరబ్ జోత్ సింగ్ కు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు వెల్లడించారు. భారత షూటర్ల ప్రదర్శన పట్ల గర్విస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News