Girl reel: అక్కడ తన్నుకుంటుంటే.. సంబరంగా రీల్​ చేసింది.. వైరల్​ వీడియో!

girl records reel amid violent street fight

  • హిమాచల్ ప్రదేశ్ లో ఓ బిజీ రోడ్డుపై ఘటన
  • కొట్టుకుంటున్న వారిని ఆపకుండా సంబరంగా రీల్ చేయడమేంటంటూ నెటిజన్ల ఫైర్
  • సోషల్ మీడియాలో నైతిక విలువలే లేకుండా పోయాయని మండిపాటు

అది హిమాచల్ ప్రదేశ్ లోని ఓ బిజీ రోడ్డు. నలుగురు యువతీ యువకులు రోడ్డుపైనే కొట్టుకుంటున్నారు. జుట్లు పట్టుకుని లాక్కుంటున్నారు. ఇదంతా చూసి వారిని ఆపే ప్రయత్నం చేయకుండా.. ఓ అమ్మాయి రీల్ చేయడం మొదలుపెట్టింది. కొట్టుకుంటున్నవారిని బ్యాక్ గ్రౌండ్ లో చూపుతూ.. సంబరంగా, నవ్వుతూ రీల్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. కొందరు ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ రీల్ చేసిన యువతి తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
  • ‘‘రెండు మూడేళ్లుగా సిమ్లా లోయ ప్రాంతం రీల్ మేకర్లకు అడ్డాగా మారింది. ఎన్నో పనికిరాని, పిచ్చిపిచ్చి వీడియోలు చేస్తున్నారు. అలా ఓ అమ్మాయి చేసిన వీడియో ఇది. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి” అని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు.
  • సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో, లైకుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితి నెలకొందని నెటిజన్లు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News