Katipalli Venkata Ramana Reddy: అసెంబ్లీ తీరు విమర్శలు, ప్రతివిమర్శలకే సరిపోతోంది: కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Katipalli unhappy with assembly sesstions

  • ప్రజాసమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు సరికాదన్న బీజేపీ ఎమ్మెల్యే
  • సీనియర్ సభ్యుల నుంచి తమలాంటి కొత్తవారు నేర్చుకునేలా ఉండాలని వ్యాఖ్య
  • రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సరిగ్గా అందడం లేదన్న వెంకటరమణారెడ్డి

అసెంబ్లీ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతివిమర్శలకే సరిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై చర్చను, పరిష్కారాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... తాను రాజకీయాలకు కొత్త కాదని... సభకు మాత్రమే కొత్త అన్నారు. సీనియర్ సభ్యుల నుంచి తమలాంటి కొత్తవారు నేర్చుకునేలా సభ నడవాలని ఆకాంక్షించారు. భూమికి ఎవరూ ముగ్గు పోయలేదని, ఒకరు చేసిన పనిని మరొకరు ముందుకు తీసుకువెళుతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రైతుకు కావాల్సిన విద్యుత్ అందటం లేదని వాపోయారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు తప్ప... ఎలక్ట్రిక్ డిపోలను ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. ఇళ్ల మీద ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News