G Jagadish Reddy: అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి?: జగదీశ్ రెడ్డి ప్రశ్న

Jagadeesh Reddy questions about telanana debts

  • అప్పులు వద్దంటే నోట్లు ముద్రించాలా? అని ఎద్దేవా
  • అప్పులు చేస్తున్నట్లు కేసీఆర్ ఎప్పుడో చెప్పారన్న జగదీశ్ రెడ్డి
  • రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతికి వచ్చిందని వ్యాఖ్య

అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి? అప్పులు వద్దంటే నోట్లు ముద్రించాలా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ... రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ అంగీకరించలేదన్నారు. అందుకే, కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నట్లు చెప్పారు. విద్యుత్ మీటర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కరెంట్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందన్నారు.

2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు కాగా, 2024 నాటికి 2,349 కిలోవాట్లకు చేరుకుందన్నారు. తమ హయాంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరాను బలోపేతం చేశామన్నారు. విభజన సమయంలో వినియోగం ఆధారంగానే రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించినట్లు చెప్పారు. రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతికి వచ్చిందన్నారు.

అప్పులు చేస్తున్నట్లు కేసీఆర్ ఆరోజే చెప్పారని... కానీ ఏదో కొత్త విషయం చెప్పినట్లుగా ఇప్పుడు పదేపదే అప్పులు చేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం విడ్డూరమన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ స‌త్య‌హ‌రిశ్చంద్రుడేనని... రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదన్నారు. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డే అన్నారు. విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దొంగ‌త‌నం దొరికిందని... అందుకే రేవంత్ రెడ్డి భుజాలు త‌డుముకుంటున్నార‌న్నారు.

తాను విద్యుత్ విష‌యంలో నిజ‌నిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వ‌డివ‌డిగా స‌భ‌లోకి వ‌చ్చి తనకు అడ్డు తగిలారని మండిపడ్డారు. సీఎం స‌భ‌లో అడుగు పెట్ట‌గానే త‌ప్పుదోవ పట్టిందన్నారు. కేసీఆర్ కాలు గోటికి మీరు స‌రిపోతారా? అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొలగించాలని... స‌భ‌ను హుందాగా నడిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News