Lakshya Sen: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడి గెలుపు రద్దు.. రికార్డుల నుంచి తొలగింపు!

Badminton Star Lakshya Sens Paris Olympics Group Match Victory Deleted Heres Why

  • గ్వాటమాలా షట్లర్‌తో మ్యాచ్‌లో భారత క్రీడాకారుడు లక్ష్య సేన్ విజయం
  • వరుస సెట్లలో గెలిచి పైచేయి సాధించిన వైనం
  • మ్యాచ్ అనంతరం మణికట్టు గాయంతో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న గ్వాటమాలా షట్లర్‌ 
  • నిబంధనల ప్రకారం లక్ష్య సేన్ గెలుపు రికార్డుల నుంచి తొలగింపు
  • తదుపరి మ్యాచ్‌ల ఆధారంగా అతడి ర్యాంకు నిర్ణయం

భారత మేటి షట్లర్ లక్ష్య సేన్‌కు ఒలింపిక్స్‌ అనూహ్యంగా చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ గ్రూప్‌ ఎల్ మ్యాచ్‌లో అతడు అందుకున్న విజయం రద్దయిపోయింది. లక్ష్య సేన్ ప్రత్యర్థి మ్యాచ్‌ నుంచి తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం సేన్ విజయం రద్దయింది. 

శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేస్.. గ్వాటమాలాకు చెందిన కెవిన్ కోర్డన్‌తో తలపడ్డాడు. 21-8, 22-20 తేడాతో వరుస సెట్లలో పైచేయి సాధించి విజయం అందుకున్నాడు. తొలి సెట్‌లో మొదటి నుంచి లక్ష్య సేన్ పైచేయి సాధించగా రెండో సెట్‌లో ఆట పోటాపోటీగా సాగింది. చివరకు లక్ష్య సేన్ స్వల్ప తేడాతో విజయం సాధించాడు. అయితే, మణికట్టు గాయం కారణంగా కార్డన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో, గ్రూప్‌ ఎల్‌లో ఇండోనేషియా, బెల్జియం క్రీడాకారులతో తదుపరి జరగనున్న మ్యాచులు రద్దయిపోయాయి. ఈ నేపథ్యంలో లక్ష్య సేన్ గెలుపును కూడా రికార్డుల నుంచి తొలగించారు. తదుపరి మ్యాచుల ఆధారంగా సేన్ ర్యాంకు, స్కోరును నిర్ణయిస్తారు. 

మరోవైపు, ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌‌కు ఈ టోర్నీలో తొలి పతకం దక్కింది. భారత షూటర్ మనూ భాకర్ కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమెకు ప్రధాని మోదీ స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వపడేలా చేశావని ప్రశంసల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News