Cheater: విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్!

Maharashtra police arrest cheater

  • మహారాష్ట్రలో నిత్య పెళ్లికొడుకు ఫిరోజ్ నియాజ్ షేక్ అరెస్ట్
  • 20 మందికి పైగా మహిళలను పెళ్లాడిన ఫిరోజ్
  • పెళ్లి తర్వాత డబ్బు, నగలతో పరారీ

మహారాష్ట్ర పోలీసులు ఫిరోజ్ నియాజ్ షేక్ అనే నిత్య పెళ్లికొడుకును అరెస్ట్ చేశారు. 43 ఏళ్ల ఫిరోజ్ విడాకులు తీసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, దాదాపు 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మ్యాట్రిమొనీ వెబ్ సైట్ లో విడాకులు తీసుకున్న మహిళల ప్రొఫైల్స్ ను పరిశీలించి, వారికి వల విసిరేవాడు. మాయమాటలతో వారిని మభ్యపెట్టి పెళ్లి చేసుకునేవాడు. 

పెళ్లయిన తర్వాత డబ్బు, నగలతో పరారయ్యేవాడు. 2015 నుంచి అతడు ఇదే రీతిలో మహిళలను మోసగిస్తున్నట్టు గుర్తించారు. ఫిరోజ్ బారినపడిన వారిలో మహారాష్ట్ర మహిళలే కాదు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. 

అయితే బాధిత మహిళల్లో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిత్య పెళ్లికొడుకు ఆట కట్టించారు. ఫిరోజ్ స్వస్థలం మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కల్యాణ్ ప్రాంతం. 

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... రూ.6 లక్షలకు పైగా డబ్బు, ఒక ల్యాప్ టాప్, కొన్ని సెల్ ఫోన్లు, కొన్ని చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.

Cheater
Police
Women
Maharashtra
  • Loading...

More Telugu News