Arjun: అజిత్ ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Arjun first look from Vidda Muyarchi


అజిత్ కుమార్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయ‌ర్చి’. తాజాగా ఈ చిత్రం నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ చేశారు. 

ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే... ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ తో అర్జున్ నిల‌బ‌డి ఉండడం . బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడో క‌నిపిస్తుండడం గమనించవచ్చు. అస‌లు అర్జున్‌ పాత్రకు, అజిత్ పాత్ర‌కు ఉన్న లింకేంట‌నే ఆస‌క్తిని పోస్ట‌ర్‌తో క్రియేట్ చేశారు మేక‌ర్స్‌. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వాక్యం మ‌రింత క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. 

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. విడాముయర్చి చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News