Jaipal Reddy: కుటుంబ సభ్యులతో కలిసి జైపాల్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి నివాళి

Revanth Reddy Tributes Jaipal Reddy


కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఉదయం నెక్లెస్‌రోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే, నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్‌లో నిర్వహించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి టూంబ్స్‌ను పరిశీలించారు. అక్కడ మొక్క నాటారు. కాగా, ఆగాఖాన్ ఫౌండేషన్ 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును చేపట్టింది.

More Telugu News