Chandrababu: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు

CM Chandrababu met Union Jal Shakti Minister CR Patil


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని చంద్రబాబు కోరనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అంగీకరించాలని కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. 

పోలవరం పూర్తి చేస్తామని ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. పోలవరం మొదటి దశను మూడేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇటీవలే పార్లమెంటులో ప్రకటన చేసింది.  

పోలవరం మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్లు, మొత్తం రూ.50 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

Chandrababu
CR Patil
Polavaram Project
Andhra Pradesh
  • Loading...

More Telugu News