Vishnu Kumar Raju: బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక

Vishnu Kumar Raju as BJPLP

  • 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందన్న విష్ణుకుమార్
  • 2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగిందని విమర్శ 
  • బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపణ

బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ... 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని తెలిపారు.

2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగించిందని మండిపడ్డారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Vishnu Kumar Raju
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News