YS Sharmila: మీకెందుకు సంఘీభావం ప్రకటించాలి?.. జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న

YS Sharmila lashes out at YS Jagan


దేశరాజధానిలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుకా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది’’ అని షర్మిల తెలిపారు.

More Telugu News