Elephants: గత ఐదేళ్లలో ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి.. 628 పులుల మృత్యువాత!

2853 died due to Elephant attacks in last 5 years

  • రాజ్యసభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • ఏనుగుల దాడిలో ఒడిశాలో అత్యధికంగా 624 మంది మృత్యువాత
  • పులుల దాడుల్లో 349 మంది మృతి
  • అత్యధికంగా మహారాష్ట్రలో 200 మరణాలు

దేశంలో ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్లలో 2,853 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క గతేడాదిలోనే ఏకంగా 628 మంది గజరాజుల దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో ఒడిశాలో అత్యధికంగా 624 మంది చనిపోగా అత్యల్పంగా కేరళలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోపక్క, గత ఐదేళ్ల కాలంలో దేశంలో 628 పులులు చనిపోయినట్టు మంత్రి సభకు తెలిపారు. అలాగే పులుల దాడుల వల్ల 349 మంది చనిపోయినట్టు వివరించారు. వీటిలో సగానికి పైగా మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక్కడ ఏకంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పులుల దాడుల్లో గతేడాది 82 మంది మృతి చెందినట్టు మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ సభకు తెలిపారు.

  • Loading...

More Telugu News