Indian Railways: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై జరిమానా... రూ.5 కోట్ల ఆదాయం

Rs 5 crore collected as fine for littering spitting on rail premises in two fiscals Govt in RS

  • రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 లక్షల ఆదాయం
  • రైల్వే ప్రాంగణాలను చెత్తగా చేయవద్దని ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • ప్రస్తుతానికి జరిమానాల మొత్తాన్ని పెంచే యోచన లేదన్న అశ్వినీ వైష్ణవ్

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో రైల్వే ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి రూ.5.13 కోట్లు వసూలు చేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.

గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేశారు. అలాగే రైల్వే పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రం చేసిన వారిపై తీసుకున్న చర్యలను అడిగారు. వారిపై వేసిన పెనాల్టీ మొత్తం ఎంత అని మంత్రిని అడిగారు.

దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ... పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని, రైల్వే ప్రాంగణాన్ని సరైన నిర్వహణ, పరిశుభ్రమైన స్థితిలో ఉంచేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైల్వే ప్రాంగణాలను మురికిగా లేదా చెత్తగా చేయవద్దని ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 

రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదన్నారు. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో చెత్తవేసినందుకు, ఉమ్మివేసినందుకు గాను దాదాపు 3,30,132 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. వారికి విధించిన జరిమానా ద్వారా 5.13 కోట్ల వచ్చాయన్నారు. ఉమ్మివేయడం, చెత్తవేయడానికి సంబంధించిన జరిమానాల మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదన్నారు.

  • Loading...

More Telugu News