K Kavitha: కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు
- సీబీఐ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో మరో కోర్టులో హాజరుపరిచిన అధికారులు
- విచారణ ఈ నెల 31వ తేదీకి వాయిదా
- కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు శుక్రవారం వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో అధికారులు ఆమెను మరో కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసు విచారణను జడ్జి ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.
మరోవైపు, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్‌పై జులై 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్ట్ 5కు వాయిదా వేసింది.