Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు: హీరో సిద్ధూ జొన్నలగడ్డ

Hero Sidhu Jonnalagadda said that A good film like Committee Kurrollu will be loved by the audience

  • ఇవాళ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన యంగ్ హీరో
  • చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోందన్న సిద్ధూ
  • ఈ నెల 9న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ
  • ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి రెస్పాన్స్

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ శుక్రవారం రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడాడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారని సిద్ధూ అన్నాడు.

‘‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థ్యాంక్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద హిట్ చేస్తారు’’ అని సిద్ధూ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్ధూ గారికి థ్యాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేశ్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్. కమిటీ కుర్రోళ్ళు అంతా మూడేళ్లుగా సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ.. ‘‘మా ఈవెంట్‌కు వచ్చిన సిద్ధూ గారికి ధన్యవాదాలు. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్ధూ గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. నిహారిక, ఫణి లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. రమేశ్ గారు మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లలోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’’ అని అన్నారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘‘మా కమిటీ కుర్రోళ్లు టీమ్‌కు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్ధూ గారికి 
ధన్యవాదాలు. ఎమోషనల్ క్యారీ అయ్యేటట్టుగా.. అనుకున్నది అనుకున్నట్టుగా యదు సినిమాను తీశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’’ అని ప్రేక్షకులను కోరారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేశ్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. యదు గారు మంచి సినిమాను తీశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మంచి యూత్ ఫుల్ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాకు సిద్ధూ లాంటి హీరో గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చూసి అందరూ సక్సెస్ చేయాలి’’ అని అన్నారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సిద్ధూ గారికి థ్యాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి.. అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు.

కెమెరామెన్ రాజు మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సిద్ధూకి ధన్యవాదాలు అని అన్నారు. యదు గారు మంచి కథను రాశారని, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని పేర్కొన్నారు. తన విజువల్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారని,  సినిమాను అందరూ చూడాలని ఆయన అన్నారు.

కాగా నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహించారు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సినిమాకు సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • Loading...

More Telugu News